Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు.
Bengal girl murder: పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ట్యూషన్ క్లాస్‌కి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసి పొలాల్లో శవాన్ని పారేశారు. ఈ ఘటన దక్షిణ్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే ఈ దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు కారణమైంది.
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు…
BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు.
CPI Ramakrishna: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మైనర్ బాలిక కిడ్నాప్, హత్య సంచలనంగా మారింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో కోచింగ్ క్లాస్‌కి హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక హత్యకి గురైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిరసనకారులు బాలిక హత్యకు నిరసనగా పోలీస్ స్టేషన్‌ని ధ్వంసం చేసి తగులబెట్టారు. అయితే, బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారని బీజేపీతో సహా బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు బాలిక పోస్టుమార్టం నివేదిక కోసం…
DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
TPCC Chief Mahesh Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు అని మండిపడ్డారు.