Haryana elections: ఓటమి తర్వాత బాలికలకు ఫ్రీ బస్ సర్వీస్‌ని నిలిపేసిన ఎక్స్-ఎమ్మెల్యే..
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎక్స్-ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..
- విద్యార్థినులకు అందిస్తున్న ఫ్రీ -బస్ సర్వీస్ నిలిపివేత..
- గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ సేవల్ని అందించాలని కోరిన బలరాజ్ కందూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ చేతిలో అనూహ్యమైన ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్, కార్యకర్తలు ఢీలా పడ్డారు. చాలా చోట్ల తాము గెలుస్తామని అనుకున్నప్పటికీ ఓటమి మరోసారి పలకరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, 37 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది.
హర్యానాలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులకు సేవ చేస్తారనే మంచి పేరు ఉన్నప్పటికీ వారు కూడా ఓడిపోయారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ లోని మెహమ్ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ కుందూ జిల్లాలో విద్యార్థినుల కోసం తాను అందిస్తున్న ఉచిత బస్సు సర్వీసుని నిలిపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హర్యానా జనసేవక్ పార్టీ(హెచ్‌జేపీ) నాయకుడు కుందూ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎన్నికైన బలరామ్ డాంగి ఈ బాధ్యత తీసుకుని బాలికలకు ఉచిత బస్సు సౌకర్యం అందించాలని కోరారు. ప్రజలు తాను చేస్తున్న సేవకు ప్రతిఫలం ఇవ్వలేదని తన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తాను ఉచిత బస్సు సర్వీసుని ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.
Also Read
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
Read Also: Delhi: ఢిల్లీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహం.. ఆ రూట్లలో వెళ్తే బాదుడే!
కుందూ 2017లో 8 వాహనాలతో ఈ సేవని ప్రారంభించారు. క్రమంగా 18 బస్సులకు విస్తరించారు. ఇవి మెహమ్‌లోని వివిధ గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు మహిళా విద్యార్థులను తీసుకెళ్తాయి. ఈ సేవల గురించి ఒక విద్యార్థిని మాట్లాడుతూ.. ఈ బస్సులు 47 గ్రామాల నుంచి తమను పాఠశాలలు, కళాశాలకు తీసుకెళ్తాయని, తమ కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని, బాలికలు సురక్షితంగా చేరుకునేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
ఇంత సేవల చేసినప్పటికీ ప్రజలు తనను ఆదరించలేకపోవడంపై కుందూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి, ఓటర్ల స్పందన తీవ్రంగా బాధించాయని తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఈ స్థానం నుంచి గెలిచిన కాంగ్రస్ అభ్యర్థి బలరాం డాంగి బస్సు సర్వీసుని నిలిపేయకుండా చూస్తానని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాను సేవని మొదలుపెట్టలేదని చెబుతున్న కందూ ఈ సేవల్ని ఇప్పుడు ఎందుకు ఆపాలి..? అని డాంగీ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం డాంగి56,865 ఓట్లతో సమీప ప్రత్యర్థి కుందుపై 18,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!