P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు.
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు.
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా…
పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్ రెండు పతకాలు సాధించింది. చిన్న వయసులో రెండు పతకాలు సాధించడంపై భారతీయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పారిస్ నుంచి భారత్‌కు వచ్చాక.. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి పతకాలు చూపించింది.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, గ్రామ పంచాయతీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుందని రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు.. బిల్లులు రాక 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుడు రేవంత్ అన్నారు.
రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ సంపద మొదటగా మైనారిటీలకు దక్కలనేది కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకుంటుంది.. కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారు.. కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Krishnaiah: బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశాను అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నాను.. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయ బద్ద వాటా వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు.
వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు.