Nayab Singh Saini: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుసగా మూడో విజయాన్ని సాధించి పెట్టిన నయాబ్ సింగ్ సైనీ ఈ నెల 15వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పంచకుల జిల్లా కమీషనర్ నేతృత్వం వహిస్తారు.
Read Also: Ponnam Prabhakar: రుణమాఫీ చేస్తాం కానీ అంతవరకు మాత్రమే..
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఇతర అగ్రనేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, మార్చిలో సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టారు. హర్యానా రాష్ట్రంలోని ప్రధాన ఓటు బ్యాంకు అయిన ఇతర వెనుకబడిన తరగతుల నుంచి ఆయన వచ్చారు. గత దశాబ్దం పాటు అధికార వ్యతిరేకతతో పాటు ఎగ్జిట్ పోల్ అంచనాలకు వ్యతిరేకంగా బీజేపీ హర్యానాలో హ్యట్రిక్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో భారతీయ జనతా పార్టీ 48 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక, కాంగ్రెస్ 37 సీట్లతోనే సరిపెట్టుకుంది. అలాగే, సావిత్రి జిందాల్‌తో సహా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.