Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
- కర్ణాటకలో బీజేపీ హయంలో కోవిడ్ స్కాం..
- కుంభకోణంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
- అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also: Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
కాగా, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లోని నాలుగు జోన్లు, రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కమిషన్ నివేదికలు కోరింది. సంబంధిత శాఖల నుంచి 55,000 ఫైళ్లను ధృవీకరించిన తర్వాత “పాక్షిక” నివేదికను ప్రభుత్వానికి సిట్ సమర్పించింది. రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవినీతికి పాల్పడిన సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇక, క్రిమినల్ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నా సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని మంత్రి హెచ్‌కె పాటిల్ చెప్పుకొచ్చారు. అయితే, 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న సమర్పించినట్లు తెలిపారు.. అందులో రూ. 7,223.64 కోట్ల స్కాం జరిగినట్లు చెప్పారు.
Read Also: Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
అయితే, అవకతవకలకు సంబంధించి సంబంధిత అధికారుల ద్వారా క్యాబినెట్ సబ్‌కమిటీకి సహకరిస్తుంది అని మంత్రి హెచ్‌కె పాటిల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 43 క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. మైనింగ్‌లో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక లోకాయుక్తలో ఏర్పాటు చేసిన సిట్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మొత్తం పెట్టుబడితో ఒకలిపురంలో సెరీకల్చర్ శాఖకు చెందిన 4.25 ఎకరాల భూమిలో రూ. 527.50 కోట్ల అంచనా వ్యయంతో “రేష్మే భవన” నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్టలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో హైటెక్ కోకూన్ మార్కెట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది .
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!