Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..
- మహారాష్ట్ర అధికార కూటమిలో విభేదాలు..
- కేబినెట్ భేటీ నుంచి వెంటనే వెళ్లిపోయిన అజిత్ పవార్..
- సీఎం ఏక్‌నాథ్ షిండే.. డిప్యూటి సీఎం అజిత్ పవార్ మధ్య వాగ్వాదం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ -శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహాయుతి’’ కూటమి భావిస్తుంటే, బీజేపీ కూటమికి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘‘మహావికాస్ అఘాడీ’’ భావిస్తోంది. నవంబర్ నెలలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Agniveers: ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి..
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర అధికార ‘‘మహాయుతి’’ కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కేవలం సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకే అజిత్ పవార్ బయటకు వచ్చేశారు. కేబినెట్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు అజిత్ పవార్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా కేబినెట్ 38 నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి గురించి ముందస్తు నోటిఫికేషన్ లేకపోవడం, సమాచారం ఇవ్వకపోవడంపై అజిత్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
రతన్ టాటాకి కేబినెట్ సంతాపం తెలిపిన తర్వాత అజిత్ పవార్ సమావేశం నుంచి బయటకు వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు ఇదే చివరి కేబినెట్ సమావేశం. ఆర్థిక ప్రతిపాదనల్ని ఆమోదించే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీట్ల ప్రతిపాదన పూర్తి కాకముందే ఇలా ఒకేసారి ఇన్ని ప్రతిపాదనల్ని ఆమోదించే విషయంలో విముఖత వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఆర్థికమంత్రిగా అజిత్ పవార్ ఉన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?