ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే, తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం అంటున్నారు ప్రకాష్ జైన్.. కానీ, ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.
Elections Results: నేడు హరియాణా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం నుండి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రములోని ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో జోరు చూపించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోందని చెప్పవచ్చు. దింతో రాజకీయ నాయకులు టెన్షన్.. టెన్షన్.. గా ఉన్నారు. ఇకపోతే అటు జమ్మూకశ్మీర్ లో వార్ వన్…
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ను ఏ పార్టీ పాలిస్తుంది అనేది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు అవామీ ఇత్తెహాద్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ఓ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఇంజనీర్ రషీద్ మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.…
Haryana Elections 2024: హర్యానా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు.. గరిష్టంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968,72లో, 2005,09లో కాంగ్రెస్ ను గెలిపించగా.. 2014, 19లో బీజేపీకి అధికారం అందించారు.. ఈసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది . కానీ అందుకు విరుద్ధంగా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన ఓట్ల లెక్కింపులో కూడా ఆ మార్క్ స్పష్టంగా కనపడుతోంది.…
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు బెంబేలెత్తించారు. ముంబైలోని సీబీఐ అధికారులుగా చెబుతూ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదివరకే వాకాటిపై సీబీఐ కేసులు ఉండటంతో ఆయనకు కొంత అవగాహన ఉంది. దీంతో ఆయన గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ.. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” (ఎన్.సి) సిద్దమే అని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధే, అభ్యున్నతే అందరి లక్ష్యం అయునప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంద.? ఎందుకు కాకూడదు? అంటూ.. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. నాకెలంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఏలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నానని ఆయన అన్నారు.…
Assembly Election Results: ఈరోజు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా మెజారిటీ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని, కాశ్మీర్‌లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…
PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.