ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ…
ఏపీలో అధికారపార్టీని విమర్శించే స్వంత పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దాడులు చేయడం జన్మ హక్కుగా వైసీపీ వ్యవహారిస్తోంది.సీఎం జగన్ స్పందించి, సుబ్బారావుపై దాడికి పాల్పడిన వ్యక్తుల చేత గుప్తా కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. సుబ్బారావుపై దాడి చేసిన వారిని పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టించి, పోలీసుల చేత అరెస్టు చేయించాలి. దాడులతో భయోత్పాతం సృష్టిస్తే అడ్డుకట్ట వేయడానికి…
ఆంధ్ర ప్రదేశ్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు సమాధి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటగిరి పట్టణంలో పర్యటించి స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ పాలనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకి నాంది పలికారన్నారు. రాష్ట్రంలో…
బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు. బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి…
ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి,…
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ,…
టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. సోము వీర్రాజు వ్యాఖ్యలపై కాకాని గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులతో వైసిపి నాయకులు మిలాఖత్ అని మాట్లాడుతున్న సోమువీర్రాజు మీతో తిరుగుతున్న నాయకులు మీ పార్టీ నాయకులేనా.. టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. సోమువీర్రాజు ఆయన బిజెపి శ్రేణులే టీడీపీ సహకారంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారన్నారు. బద్వేల్ ఎన్నికలలో భారీ పరాజయం ఖాయం అని బీజేపీ ముందే డిసైడ్ అయ్యి ఓటమికి…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన…