ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల కోడ్ అమలయ్యేలా చూడాల్సిన పోలీసులు ర్యాలీకి బందోబస్తు కల్పించారని సోము వీర్రాజు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాలు బద్వేల్ లో ప్రభుత్వ వైఫల్యాలను సూచిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యానికి ఈ చర్యలు నష్టం కలిగించేలా ఉన్నాయి. పోలింగ్ పై ప్రభావం చూపేలా ఉన్నాయని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో సోము వీర్రాజు వివరించారు.