Dk Aruna on Kcr: ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీస్తావా కేసీఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె ప్రకటన విడుదల చేశారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడడం దురదృష్టకరమని, ఎన్నికల సమయంలో సరిహద్దుల్లో అలజడులు రేగుతున్నాయని కేసీఆర్ ప్రకటించడం శత్రు దేశాల వాదనకు బలం చేకూర్చడమే అవుతుందని అన్నారు. భారత ఆర్మీ ఛీఫ్ , వాయుసేన ఛీఫ్ సర్జికల్ స్ట్రైక్ పై ప్రకటన విడుదల చేశాక ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు.
బాధ్యతాయుతమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి పాకిస్థాన్ మంత్రి అడిగినట్లుగా సర్జికల్ స్ట్రైక్ కు సాక్ష్యాధారాలు అడగడం కేసీఆర్ దిగజారుడు రాజకీయమే అవుతుందని డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం ,జాతీయ స్థాయిలో చిన్న స్థానం కోసం రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా మాట్లాడడం టీఆర్ఎస్, కేసీఆర్ థర్డ్ క్లాస్ మనస్తత్వానికి నిదర్శనమన్నారు.
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
బిపిన్ రావత్ పై ఈరోజు కపట ప్రేమ చూపెడుతున్న కేసీఆర్ , కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ రావత్ ని అసభ్యంగా దూషించినప్పుడు ఎందుకు ప్రగతి భవన్ లో నిశ్శబ్దంగా ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. రాజకీయాల కోసం గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న కేసీఆర్ కళ్ళకు బిపిన్ రావత్ పార్థివ దేహన్ని తమిళ నాడు నుండి తరలిస్తుండగా తమిళ ప్రజలు జాతీయ జెండాను చేతపట్టుకుని రహదారుల వెంట నివాళులు అర్పించిన సంగతి కనిపించలేదా ? జాతీయ జెండా నీకు బీజేపీ జెండాగా కనిపించిందా? అన్నారు.
కొత్త రాజకీయ పార్టీ పెట్టుకో ,లేకుంటే కొత్త ఫ్రంటో ,టెంటో పెట్టుకో కానీ దేశ భద్రతను తాకట్టుపెట్టేలా , పాకిస్థాన్ ప్రకటనలకు బలం చేకూర్చేలా ,భారత ప్రభుత్వం ను అబాసుపాలు చేసేలా ఇంకోసారి మాట్లాడితే నీకు తగిన శాస్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీని తట్టుకోలేక ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చలేక రోజుకో వేషం వేస్తూ రాజ్యాంగం గురించి, భారత సైన్యం గురించి ఇష్టారీతిన మాట్లాడడం నీ పతనానికి నాంది అన్నారు. నీ పిచ్చి ప్రేలాపనలతో, బీజేపీ కార్యకర్తలపై దాడులతో అధికారాన్ని కాపాడుకుంటానని భావించడం నీ అవివేకమే అవుతుందని డీకే అరుణ ముఖ్యమంత్రి తీరును దుయబట్టారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!