1. ‘అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?అన్నారు కేసీఆర్.
2 దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు.
3.ప్రధాని మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ఒప్పుకుందని.. తెలంగాణ ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు.
4.మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. దళిత బంధుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఈ పథకం దేశానికే ఆదర్శం అన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. మార్చి నుంచి నియోజకవర్గంలోని 2 వేల మంది దళితులకు దళిత బంధు పథకం అమలుచేస్తామన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి వందమందికి దళితబంధు వర్తింపచేస్తామన్నారు.
5.సంగారెడ్డి జిల్లా భెల్ లోని పోస్ట్ ఆఫీస్ లో భారీ చోరీ జరిగింది. ఆసరా పింఛన్లను సంబంధించిన 34 లక్షలు శుక్రవారం లాకర్లో పెట్టి లాక్ వేశారు. ఆదివారం పోస్ట్ ఆఫీస్ నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం ని రప్పించి పరిశీలించారు..లాకర్ లో నుంచి 33లక్షలు తీసుకొని దుండగులు పారిపోయారు. పోస్టాఫీస్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
6.కాపు రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ కేంద్రం చేతిలో ఉందని చెప్పడం మోసం అన్నారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీల పరిధిలో ఉంటాయి. ఇక పై కాపు రిజర్వేషన్ల సాధన కోసం బిజేపీ తరపున సహాయసహకారాలు అందిస్తా అన్నారు. కాపు రిజర్వేషన్లపై హామీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఒత్తిడి ఉంటేనే కాపు రిజర్వేషన్ అమలవుతుందన్నారు. రాజమండ్రిలో పలువురు జిల్లా కాపు నేతలతో ఆయన భేటీ అయ్యారు.