Bandi Sanjay on Rice: యాసంగి వడ్లను కేసీఆర్ కొనాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావ్, ఎమ్యెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, బంగారు శ్రుతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీ నారాయణ, జోనల్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలు, మాజీ ఎంపీలు, ఎమ్యెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
కేసీఆర్ చేస్తున్న సర్వేలన్నీ నెక్స్ట్ బీజేపీయే గెలుస్తుందని చెపుతున్నాయని, అయినా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాకు సూచించారు. కేసీఆర్ తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంటాడని సంజయ్ అన్నారు.యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైతే తెలంగాణ రాష్ట్రం యాసంగి వడ్లు కొనేది లేదు అని ప్లాన్ ఇవ్వలేదని సంజయ్ చెప్పారు.
కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్రం కొనక పోవడాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సంజయ్ తమ పార్టీ నాయకులకు సూచించారు.కేంద్రం రా రైస్ కొంటాము అంటే రాష్ట్రం కొనం అంటోంది. పోయిన సారి కూడా కేసీఆర్ రైతుల్ని అనవసరంగా ఆందోళనలో పదేశారని సంజయ్ గుర్తు చేశారు.కోటి టన్నుల వడ్లు పండాయి, కేంద్రం కొనట్లేదు ఢిల్లీలో పోస్తాము, స్టేట్ బీజేపీ ఆఫీస్ ముందు పోస్తాము అన్నాడు. కానీ ఇప్పటి దాకా కేంద్రం చెప్పిన 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం టార్గెట్ చేరుకోలేదు. కేంద్రం బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం సిద్ధంగా లేదు అని ఆయన చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలు వెయ్యమని చెప్పి బోనస్ ఇవ్వలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్న హామీ ఏమైంది అని సంజయ్ ప్రశ్నించారు. KCR పవర్ పై కూడా కొత్త డ్రామా చేస్తున్నాడన్నారు.వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ పెడతారని ఈ మధ్య trs నేతలు కామారెడ్డి లో అన్నారు.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారని నేను కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కాపీని చూపించి ఛాలెంజ్ చేసినా. సీఎం తోక ముడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రూ. 62 వేల కోట్లనష్టాల్లో డిస్కం లు ఉన్నాయన్నారు సంజయ్. ఏప్రిల్ 1 నుంచి 68,000 కోట్ల రూపాయలు మేర ఛార్జీ పెంచబోతున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో 20 గ్రామాలకు సరిపోయే కరెంట్ వాడుతున్నారని సంజయ్ చెప్పారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు