తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. కృష్ణా పుష్కరాల సమయంలో జోగులాంబ ఆలయాన్ని కేసీఆర్ సందర్శించి… అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మరిచిపోయారా అని ప్రశ్నించారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. జోగులాంబ ఆలయం ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. Read Also: Dr K.Lakshman: మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరు ఒకనాడు మహబూబ్ నగర్ ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న జిల్లా ప్రజలకు కన్నీరే మిగిల్చారు. బండి సంజయ్…
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్. వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే…
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ను వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. నిత్యం రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా తెలంగాణ మంత్రి కె.తారకరామారావు హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి స్పందించారు. ఆ కార్టూన్ ని రిట్వీట్ చేశారు. తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే వుంటానని అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను…
కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు…
ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈమేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు వున్నాయన్నారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆధారాలతో సహా తేల్చారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే…
కేంద్రంలో బీజేపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యునివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీకి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేంద్రం తీరుకు బాధతో వరి పంట వేయవద్దని చెప్పారు. కేంద్రం రా రైస్ ను కొనుడు కాదు..ఒడ్లు కొనేవరకు వదిలిపెట్టేది లేదు. గ్రామాలలో…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేసినా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దం అని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మాజీ…