అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్‌ను ప్రారంభించారు.
పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని…
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. పార్టీ టార్గెట్‌లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మీటింగ్ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్‌కు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది.
లోక్‌సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సమావేశం అంతా హాట్ హాట్‌గా సాగింది. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మీరు మణిపూర్‌లో భారత మాతను చంపేశారు.. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహలు.. మణిపూర్‌ను రెండు భాగాలుగా విభజించారు.. మోడీకి ఈ దేశ గుండె చప్పుడు వినే సమయం లేదు.. మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటారు అంటూ రాహుల్ గాంధీ అన్నారు.
దళితుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్… మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. భారత రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మారుస్తున్నారని ఆరోపించారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అడ్డుపడ్డ చరిత్ర ఈ బీజేపీ నాయకులుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది…