సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన పంటను, ఒక గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వం వడ్ల కొనుగోలు పై మొండివైఖరి…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి…