Kadiyam Srihari: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్, కిషన్రెడ్డి కేంద్ర మంత్రులు అయ్యారు..
- బడ్జెట్ లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది..
- రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారు..
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్, కిషన్రెడ్డి కేంద్ర మంత్రులు అయ్యారు: కడియం శ్రీహరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiyam Srihari: ఫిబ్రవరిలో 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది.. దానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ, చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని రాష్ట్రాల కలియకతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పటైంది.. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా అనేక నిధులు కేటాయించారు.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్రానికి ఎన్నో విజ్ఞాప్తులు చేశాం.. కానీ పట్టించుకోవడం లేదు.. తెలంగాణ ఇంతకీ భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పన్నులు కడుతుంటే.. రాష్ట్రానికి మోడీ సర్కార్ మాత్రం మొండి చేయి చూపిస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
Read Also: Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read
ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే బండి సంజయ్,కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులు అయ్యారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు చవటలు, దద్దమ్మలంటూ విమర్శించారు. తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చి మీ పలుకుబడి ఏంటో నిరూపించుకోండి అని సవాల్ విసిరారు. లేదంటే తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న మొండి వైఖరికి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దొడ్డి దారిన వచ్చింది.. ఆమెకు ఎలాంటి అనుభవం లేదు అని సెటైర్లు వేశారు. ఈ బీజేపీ పార్టీ మొదటి నుంచి తెలంగాణ, దళిత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందన్నాడు. మతతత్వ పార్టీల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు