మణిపూర్ అల్లర్లపై లోక్ సభలో జరుగుతున్న అవిశ్వాస తీర్మాన చర్చలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ఇందులో తాను గతంలో చేసిన భారత్ జోడో యాత్ర లక్ష్యం గురించి వివరించారు. దేశ ప్రజల్ని కలిపేందుకు తాను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను అసలు యాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా లోక్ సభలో తెలిపారు. రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. దీంతో వారిపై రాహుల్ మధ్య మధ్యలో సెటైర్లు కూడా వేశారు.
Read Also: iQOO Z7 Pro 5G Price: సూపర్ డిజైన్‌తో ఐకూ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
మణిపూర్ ప్రజలను చంపి మీరు భరతమాతను హత్యచేశారు అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ మణపూర్ వెళ్లలేదని.. కానీ తాను వెళ్లానని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ లో మణిపూర్ లేకుండా మోడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ కనీస భరోసాను కల్పించలేక పోయారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Read Also: Arvind Kejriwal: థ్యాంక్స్ రాహుల్ గాంధీజీ..
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అడ్డుతగిలారు.. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమో, అదానీ గురించి ఈరోజు మాట్లాడను అంటూ రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దృష్టిలో మణిపూర్ మన దేశంలో లేదు అనే భావనలో ఉన్నట్లున్నారు అని రాహుల్ అన్నారు. మీరు మణిపూర్‌లో భారత మాతను చంపేశారు.. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహలు.. మణిపూర్‌ను రెండు భాగాలుగా విభజించారు.. మోడీకి ఈ దేశ గుండె చప్పుడు వినే సమయం లేదు.. మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటారు అంటూ రాహుల్ గాంధీ అన్నారు.