అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ASHA Workers Protest: హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ సంగం కాంటీన్‌లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసిందొ. సంగం 1, 2 కోర్టు యార్డ్ దగ్గర స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఇటీవల అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: మరో నాలుగు రోజులు వడగళ్ల వాన..! వాతావరణశాఖ హెచ్చరిక