Rahul vs Modi: లోక్‌సభలో రాహుల్ స్పీచ్.. పదే పదే మోడీ, బీజేపీ ఎంపీల అభ్యంతరం
- లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రసంగం
- పదే పదే అడ్డుతగిలిన ప్రధాని మోడీ.. బీజేపీ ఎంపీలు
- గత పదేళ్ల ఎన్డీఏ పాలనపై విపక్ష నేత ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సమావేశం అంతా హాట్ హాట్‌గా సాగింది. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని రాహుల్ ఆరోపించారు. అందులో తానూ బాధితుడినేనని.. తనపై కూడా 20కిపైగా కేసులు మోపారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
తనకు రెండేళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అలాగే ఇల్లు కూడా తీసేసుకున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నట్లు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. అయితే రాహుల్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ సహా బీజేపీ ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra Video: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు
ఇక ప్రసంగం మధ్యంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ తెలిపారు.
#WATCH | Leader of Opposition in Lok Sabha, Rahul Gandhi says, "…The PM says that (Mahatma) Gandhi is dead and Gandhi was revived by a movie. Can you understand the ignorance?… Another thing I noticed is that it is not just one religion that talks about courage. All religions… pic.twitter.com/2N3NdYHNw8
— ANI (@ANI) July 1, 2024
#WATCH | After LoP Lok Sabha Rahul Gandhi attacks him, PM Modi responds by saying, "Calling the entire Hindu community violent is a very serious matter." pic.twitter.com/HrpCvLg3hF
— ANI (@ANI) July 1, 2024
#WATCH | Responding to LoP Rahul Gandhi, Union Home Minister Amit Shah in Lok Sabha says, "The Leader of Opposition has categorically said that those who call themselves Hindu talk of violence and do violence. He doesn’t know that crores of people proudly call themselves Hindu.… pic.twitter.com/yFwIsXeTN6
— ANI (@ANI) July 1, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!