రంగారెడ్డి జిల్లాలో 12యేళ్ల బాలికకు 35యేళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. అదీ బర్త్ డే చేస్తున్నామన్న పేరుతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. దీంతో పోలీస్ కేసు నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక పేరుతో ఈ వివాహ వేడుకను నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే తనకు ఈ పెళ్లి…
తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతున్నారు అజత్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ 1971 మే 1న సికిందరాబాద్…
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను…
బర్త్‌డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇటీవలే అటవీశాఖ అధికారులు ఓ చిన్న ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చిన్న గున్న ఏనుగు జన్మించి ఏడాదైన సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ వేడుకను నిర్వహించారు. అంతేకాదు, ఆ చిన్న గున్న ఏనుగుకు పేరు పెట్టేందుకు…
తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు దగ్గుబాటి సురేశ్ బాబు. అంతకు ముందు ఆయన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూడా అదే తీరున తెలుగు సినిమా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి సురేశ్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మన తెలుగు…
తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా అధినేతలు మాట్లాడుతూ, ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్…
హిందీ చిత్రసీమలో కండలు తిరిగిన సౌష్టవంతో స్టార్స్ గా రాణించిన ఆ నాటి నటుల్లో ధర్మేంద్ర స్థానం ప్రత్యేకమైనది. ‘మేచో మేన్’గా పేరొందిన తొలి హిందీ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. అప్పట్లో ఎంతోమంది అందాలభామల కలల రాకుమారునిగా ధర్మేంద్ర రాజ్యమేలారు. ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలభామను తన సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. తనదైన అభినయంతో ధర్మేంద్ర బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ అలరిస్తూ సాగారు. కలర్ సినిమా రోజుల్లో అయితే ధర్మేంద్ర…
పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. అనిల్ రావిపూడి 1982 నవంబర్…
తెలుగు సినిమా రచయిత సత్యానంద్ ను చూడగానే, ఆయన ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. అతిగా మాట్లాడరు. కానీ, ఆయన మాటలు మాత్రం జనం నోట చిందులు వేసేలా చేస్తుంటారు. చిత్రసీమలో ఎంతోమందికి సన్నిహితులు సత్యానంద్. ఎవరినీ నొప్పించరు. తన దరికి చేరిన అవకాశాలతో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సత్యానంద్ మాటల తూటాలు అంతగా పేల్చడం లేదు. కానీ, ఆయన కథలతో మాత్రం చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకప్పుడు సత్యానంద్ రచన అనేది తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్…