రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా అధినేతలు మాట్లాడుతూ, ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ఈ ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల మూడో వారం వరకు షూటింగ్ కొనసాగుతుంది. కొనసాగుతుంది” అని అన్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన యూనిట్ సభ్యులకు రెజీనా ధన్యవాదాలు తెలిపింది.
‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్ విడుదల!
ఇదిలా ఉంటే రెజీనా నటిస్తున్న మరో చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’ పోస్టర్ నూ ఈ చిత్ర నిర్మాతలు బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. అలానే ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఈ రోజు విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నిర్మిస్తున్న సినిమా ‘శాకిని డాకిని’. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుధీర్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయగా, డిసెంబర్ 13 రెజీనా పుట్టిన రోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెజీనా, నివేదా థామస్ ఇద్దరూ మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.