రెండంటే రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా, కుర్రకారు రెండు కళ్ళ నిండా నిలచిపోయింది అందాల భామ కియారా అద్వాణీ. అమ్మడి అందం చూసి కొందరు యంగ్ హేమామాలిని అన్నారు. మరికొందరు, సైరాబానును గుర్తు తెచ్చిందీ అని చెప్పారు. ఎవరు ఎలా పోల్చినా, కియారా అద్వాణీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అభినయం చూసిన యువకులెవ్వరూ ఆమెను మరచిపోలేరు. ఆ చిత్రంలోని కియారా అందాన్ని తలచుకుంటే చాలు కుర్రాళ్ళలో విద్యుత్…
విలక్షణమైన పాత్రల్లో, వైవిధ్యమైన అభినయంతో ఆకట్టుకుంటూ సాగారు శరత్ బాబు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ శరత్ బాబు అభినయం అలరించింది. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో ఓ అతిథి పాత్రలో కనిపించారు శరత్ బాబు. వందలాది చిత్రాలలో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్న శరత్ బాబు, ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు.…
తెరపై కనిపించేదంతా నిజం కాదు అని సినిమాలు చూసే జనానికి తెలుసు. కానీ, తాము అభిమానించే నటీనటులు కనబరిచే అభినయానికి ఫిదా అయిపోతూ, ఈలలు కేకలు వేసి ఆనందిస్తుంటారు. అలాగే తెరపై కరడుగట్టిన హృదయం ఉన్న విలన్ గా నటించేవారికి, నిజజీవితంలో కరుణ చూపే తత్వం ఉంటుందని తెలిసినప్పుడూ జనం అదే తీరున స్పందిస్తూ ఉన్నారు. అనేక చిత్రాలలో ప్రతినాయకునిగా పలకరించి, భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తున్నారు.…
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో…
డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోమవారం(జూలై5), కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యానర్‌లో ఇంతకు ముందు కళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం 118సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్‌రామ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక…
(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు) ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే…
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని నాలుగంటే నాలుగే చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, ఐదో చిత్రంగా ‘సీటీమార్’ రూపొందింది. గత సంవత్సరమే జనం ముందుకు రావలసిన…
చిత్రసీమలో ‘గురువు’ అని అందరిచేతా అనిపించుకున్నవారు దాసరి నారాయణరావు అయితే, సినిమా రంగంలో పరిచయం ఉన్నవారినల్లా ‘గురువా’ అంటూ సంబోధించేవారు ముత్యాల సుబ్బయ్య. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒకరోజు రాణించవచ్చునని పలువురు నిరూపించారు. ముత్యాల సుబ్బయ్య సైతం అలా నిరూపించిన వారే. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి, ఘనవిజయాలను చూసినా, తనదైన పంథాలోనే పయనిస్తూ ‘గురువా…’ అంటూనే సాగారు. ప్రస్తుతం సుబ్బయ్య చేతిలో సినిమాలు లేవు. కానీ, ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ఈ…
జెనీలియా నాయికగా నటించిన కథ చిత్రంతో 2009లో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిత్ అరుణ్. అప్పటి నుండీ రొటీన్ కు భిన్నమైన కథలనే ఎంపిక చేసుకుంటూ ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. వీకెండ్ లవ్, తుంగభద్ర, గరుడవేగ చిత్రాలతో పాటు 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలతో కుర్రకారుకూ దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. మన ముగ్గురి లవ్ స్టోరీ, లెవన్త్ అవర్ వంటి తెలుగు వెబ్ సీరిస్ లలోనూ…