Kovai Sarala Birthday: కోట్ల నవ్వులు పూయించిన కోవై సరళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ.
కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను ఇట్టే ఆట పట్టించేవారు. అయితే అందరితోనూ కలసి పోవడం ఆమె నైజం. చిన్నప్పుడు యమ్.జి.ఆర్. సినిమాలు విపరీతంగా చూసి ఆనందించేవారు సరళ. ఆయన సినిమాల్లోని పాటలను సైతం భట్టీయం వేసి పాడుకుంటూ సాగేవారు సరళ. అలా సినిమాలపై సరళకు ఆసక్తి కలిగింది. సరళ తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో విజయకుమార్, కె.ఆర్.విజయ జంటగా నటించిన ‘వెల్లి రదం’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. భాగ్యరాజా నటించి, తెరకెక్కించిన ‘ముందానై ముడిచ్చు’లో 32 ఏళ్ళ గర్భవతి పాత్రలో నటించారామె. అప్పుడు సరళ పదో తరగతి చదువుతున్నారు. తరువాత రెండేళ్ళకు అదే భాగ్యరాజాకు ‘చిన్నవీడు’ సినిమాలో 65 ఏళ్ళ తల్లి పాత్రలోనూ కోవై సరళ నటించి అబ్బుర పరిచారు. ఇలా చిన్నా చితకా పాత్రలు పోషిస్తున్న సరళకు కమల్ హాసన్ నిర్మించి, నటించిన ‘సతీ లీలావతి’లో ఏకంగా ఆయనకు భార్యగా నటించే అవకాశం దక్కింది. అందులో కోవై సరళ, కమల్ హాసన్‌తో పోటీ పడి కామెడీ పండించాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ సినిమా విజయంతో కోవై సరళ తమిళనాట బిజీ కమెడియన్ అయిపోయారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తెలుగులో కోవై సరళ తొలి చిత్రం బి.విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా రూపొందిన ‘వీరప్రతాప్’. తరువాత ‘అమ్మ కడుపు చల్లగా, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లామా మజాకా, కుంతీ పుత్రుడు, భైరవద్వీపం, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, పెళ్ళి’ వంటి చిత్రాలలో తనకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు. ‘నువ్వే కావాలి’లో కోవై సరళ పండించిన కామెడీ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగునాట మరింత బిజీ అయిపోయారామె. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్‌లో కోవై సరళ నటించిన అనేక చిత్రాలు జనానికి కితకితలు పెట్టాయి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో ప్రవేశించి, వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నారామె. తన బంధువుల పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కోసం కోవై సరళ వివాహం చేసుకోలేదు. ఆ పిల్లలనే కన్నబిడ్డల్లా పెంచుకున్నారామె. తన అభిమాన హీరో ఎమ్జీఆర్ స్ఫూర్తితో కోవై సరళ రాజకీయాలపైనా ఆసక్తి పెంచుకున్నారు. తనకు గుర్తింపు సంపాదించి పెట్టిన కమల్ హాసన్ నెలకొల్పిన ‘మక్కల్ నీది మయం’ పార్టీ సభ్యురాలుగా ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారామె.
(ఏప్రిల్ 7న కోవై సరళ పుట్టినరోజు)
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!