విలక్షణమైన అభినయానికి నిలువెత్తు నిదర్శనం కమల్ హాసన్. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా కమల్ అభినయాన్ని అభిమానించేవారి సంఖ్య లెక్కలేనిది. ఆరు పదులు దాటి అర్ధపుష్కరమైనా, ఇప్పటికీ కమల్ హాసన్ లో మునుపటి ఉత్సాహం, అదే తపన, ఎప్పటిలా ఓ విద్యార్థిలా నేర్చుకోవడం అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాట జన్మించి, అక్కడ స్టార్ హీరోగా రాజ్యమేలినా, తెలుగునేలపైనే కమల్ కు అత్యధిక సంఖ్యలో అభిమానులున్నారని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా మూడు సార్లు నిలచిన తొలి…
ఒకప్పుడు మాటల మాంత్రికుడు అనగానే తెలుగువారికి ప్రఖ్యాత రచయిత పింగళి నాగేంద్రరావు గుర్తుకు వచ్చేవారు. కానీ, ఈ తరం ప్రేక్షకులు మాత్రం ‘మాటల మాంత్రికుడు’ అని త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన…
(నవంబర్ 5న మెహ్రీన్ పుట్టినరోజు)తెలుగు సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తొలిసారి నాయికగా తెరపై వెలిగింది మెహ్రీన్ పిర్జాదా. ఈ పంజాబీ ముద్దుగుమ్మ వచ్చీ రాగానే తెలుగువారిని ఆకట్టుకుంది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసింది. ఇప్పటికీ తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ఆ మధ్య ‘ఎఫ్ -2’లో వరుణ్ తేజ్ జోడీగా అలరించిన మెహ్రీన్, ఆ సినిమా సీక్వెల్ గా వస్తోన్న ‘ఎఫ్-3’ లోనూ నటిస్తోంది. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో…
చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అందుకని మేకప్ భలేగా మెత్తదు. అలాగని ఆమెను చూసినా మొహం మొత్తదు. ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వెదజల్లింది. పలు భాషల్లో పరిణతి చెందిన నటిలా రాణిస్తోంది. నివేదా థామస్ 1995 నవంబర్ 2న చెన్నైలో జన్మించింది.…
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్న మాటలు కొందరి విషయంలో తప్పకుండా గుర్తుచేసుకోవాలనిపిస్తుంది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు అయిన రాఘవ లారెన్స్ కెరీర్ ను చూసినప్పుడు తప్పకుండా ఆ మాటలు గుర్తుకు రాక మానవు. అతని కృషిని, చేరుకున్న స్థాయిని చూసిన వారెవరైనా లారెన్స్ ను కీర్తించక మానరు. నేడు ప్రముఖ నటునిగా, దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని విజయపథంలో సాగిపోతున్న లారెన్స్ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. లారెన్స్ 1976 అక్టోబర్…
హిందీ చిత్రసీమకు త్రిమూర్తులుగా వెలిగారు దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్. వారి తరువాతి తరం హీరోల్లో మేచో మేన్ గా జేజేలు అందుకున్నారు ధర్మేంద్ర. ఆయన నటవారసుడుగా సన్నీ డియోల్ సైతం విజయపథంలో పయనించారు. సన్నీ డియోల్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 2019లో గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ టిక్కెట్ పై ఎంపీగా గెలుపొందారు. ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ప్రకాశ్ కౌర్ తొలి సంతానంగా…
చూస్తే భూమికి ఐదున్నర అడుగుల ఎత్తున పీలగా కనిపిస్తాడు. కానీ, మురుగదాస్ పవర్ ఏంటో ఆయన సినిమాలే చెబుతాయి. తెలుగువారిని ‘గజిని’ అనువాదచిత్రంతో ఆకట్టుకున్న మురుగదాస్ తరువాత చిరంజీవితో ‘స్టాలిన్’ తెరకెక్కించి అలరించారు. మహేశ్ బాబుతో ‘స్పైడర్’ తీసి మురిపించారు. ఇక హిందీలోనూ తొలి చిత్రం ‘గజిని’తోనే బంపర్ హిట్ పట్టేశారు. దేశంలో తొలిసారి వంద కోట్ల క్లబ్ కు తెరతీసిన చిత్రంగా హిందీ ‘గజిని’ నిలచింది. విజయ్ హీరోగా హ్యాట్రిక్ కొట్టేశారు మురుగదాస్. గత సంవత్సరం…
తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరుచూరి బ్రదర్స్ మాటలు కోటలు దాటుతూ, సినీజనానికి కోట్లు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. అన్న వెంకటేశ్వరరావు అనురాగం పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఆవేశం ఒలికిస్తారు. ఎంత అన్నదమ్ములైనా నలభై ఏళ్ళుగా కలసి రచనావ్యాసంగం సాగించడమంటే మాటలు కాదు. బహుశా చిత్రసీమలో ఇది ఓ అరుదైన విశేషమని చెప్పాలి. సెంటిమెంట్ ను వండడంలో మేటి వెంకటేశ్వరరావు అని పేరు, ఇక ఎమోషన్ పండించడంలో గోపాలకృష్ణకు సాటి లేరెవ్వరు అంటూ ఉంటారు. వారితో…
పాటకు పల్లవి ప్రాణం అన్నట్టుగానే తెలుగు సినిమాలకు పాటలు ఆయువు. ముఖ్యంగా టాప్ హీరోస్ మూవీస్ కు పాటలు మరింత ప్రాణం. టాప్ స్టార్స్ ఫిలిమ్స్ జనాన్ని ఆకర్షిస్తాయి, అందులో సందేహం లేదు. అయితే మరింతగా ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా అలరించే పాటలు ఉండి తీరాలి. లేదంటే సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ లో తేడా కనిపించక మానదు. అందుకనే తెలుగు చిత్రసీమలో సినీజనం పాటలకు పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఎందరో గీతరచయితలు తమదైన బాణీ పలికిస్తూ తెలుగువారిని…
కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు. ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన…