చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా…
నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన…
నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే…
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అని సినిమా డైలాగ్ ఉంది.. అక్షరాలా అది నిజమనే చెప్పాలి. బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కనిన బిడ్డ గురించి ఆమెకు కాకుండా ఇంకెవరికి తెలుస్తోంది. అబ్బాయిలు ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక తాజగా నేడు…
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ…
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల…
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో…
ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మెగా హీరో బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ వరుణ్ కి తమదైన రీతీలో విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వరుణ్ కి స్పెషల్ గా బర్త్ డే పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తమ్ముడు పుట్టినరోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగ్గా…
భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం. భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం. కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో. అందరికీ ఈ నాటికీ భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు. నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె. భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే…