ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అని సినిమా డైలాగ్ ఉంది.. అక్షరాలా అది నిజమనే చెప్పాలి. బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కనిన బిడ్డ గురించి ఆమెకు కాకుండా ఇంకెవరికి తెలుస్తోంది. అబ్బాయిలు ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు.
ఇక తాజగా నేడు తన తల్లి సురేఖ పుట్టినరోజు కావడంతో మెగా పవర్ స్టార్ ఆమెకు స్పెషల్ విషెస్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేస్తూ “నీకు తెలిసినట్లు నేనెవరికి తెలియను.. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ” అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫోటో ఆచార్య షూటింగ్ సమయంలో దిగినట్లు తెలుస్తోంది. చిరు నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎంతో అపురూపంగా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాప్ అన్నా అంటూ అభిమానులు కూడా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
No one knows me like you do!!
— Ram Charan (@AlwaysRamCharan) February 18, 2022
Happy birthday maa🎂❤️!! pic.twitter.com/CEzqCsvsSZ