Home
Birthday Wishes
Birthday Wishes News
-
ప్రతిభతో రాణిస్తోన్న ప్రగ్యా జైస్వాల్!
చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికించడంలోనూ మేటి అనిపిస్తుంది. కానీ, ఏం లాభం ఇప్పటి దాకా ఆమె నటించిన ఏ చిత్రమూ అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది.… -
లెక్కల మాస్టర్ కి ‘లైగర్’ స్పెషల్ విషెస్..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్… -
‘పుష్ప’ సువాసనల సుకుమార్!
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం… -
ఆగని స్వరరాగ గంగాప్రవాహం… ఏసుదాస్!
ఏసుదాస్ మధురగానంతోనే దినచర్యను ప్రారంభించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆసేతుహిమాచలపర్యంతం ఏసుదాస్ గానానికి ‘సాహో’ అంటూ సలామ్ చేసేవారెందరో! ఇక తెలుగునాట ఏసుదాస్ పాటకు పట్టాభిషేకం చేసేవారి సంఖ్య తరతరానికీ పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. మళయాళ సీమలో జన్మించిన ఏసుదాస్ పాట తెలుగునాట కూడా మధురం పంచుతూనే ఉంది. తొలిసారి తెలుగువారిని ‘బంగారు తిమ్మరాజు’తో ఏసుదాస్ గాత్రం పలకరించింది. కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో ఏసుదాస్ “ఓ నిండు… -
హృతిక్ మ్యాజిక్ మళ్ళీ సాగేనా!?
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు… -
‘ఆహా’… అల్లు అరవింద్!
అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే… -
నాటి అందాల అభినేత్రి బి.సరోజాదేవి
ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు… -
భలే భాగ్యరాజా!
పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,… -
పడుకోనివ్వని దీపికా పడుకోణె అందం – అభినయం!
మెరుపు తీగెలాంటి మేనిసోయగంతో చూపరులను ఇట్టే ఆకర్షించే రూపం అందాల దీపికా పడుకోణె సొంతం. దక్షిణాదికి చెందిన ఈ తార ఉత్తరాదిని ఉడికించింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోణె పెద్దకూతురు దీపిక. ఒకప్పుడు ప్రకాశ్ కూతురుగా ఉన్న గుర్తింపును ఇప్పుడు దీపిక తండ్రి ప్రకాశ్ పడుకోణె అనే స్థాయికి తీసుకు వెళ్ళింది ఆమె అభినయ పర్వం. నవతరం నాయికల్లో దీపికా పడుకోణె తనదైన బాణీ పలికిస్తూ బొంబాయి సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. దీపికా పడుకోణె మన… -
హీరోగా అభినవ్ గోమఠం!
‘మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.…
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!