గిలిగింతలు పెట్టే నరేశ్ నవ్వుల పువ్వులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు సంపాదించారు. విజయనిర్మల సైతం బాలనటిగా అలరించిన తరువాత కథానాయికగానూ మెప్పించారు. దాంతో అందరూ తల్లికి తగ్గ తనయుడు అంటూ నరేశ్ ను అభినందించారు.
నరేశ్ 1960 జనవరి 19న జన్మించారు. తల్లి నటి కావడంతో నరేశ్ కూడా చిన్నతనంలోనే ఆమె నటించిన సినిమాల్లో బాలనటునిగా కనిపించారు. హిందీ ‘లవ్ స్టోరీ’ ఆధారంగా విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమసంకెళ్ళు’తో తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు నరేశ్. కానీ, అది అంతగా అలరించలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలోనే రూపొందిన “రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, శ్రీవారి శోభనం, మొగుడుపెళ్ళాలు, చూపులు కలసిన శుభవేళ, హై హై నాయకా, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం” వంటి చిత్రాలలో నవ్వులు పూయిస్తూనే సాగారు నరేశ్. వీటిలో ‘పుత్తడి బొమ్మ’లో ‘మూగమనసులు’లోని ఏయన్నార్ లాంటి బరువైన పాత్ర ధరించారు. కానీ, అది జనం ముందు దరువు వేయలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలో పది చిత్రాలలో నటించినా, వాటిలో మూడు సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగలిగాయి. ఇక జంధ్యాల శిష్యుడు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నరేశ్ హీరోగా రూపొందిన ‘జంబలకిడిపంబ’ పేరుకు తగ్గట్టే నవ్వులతో పంబరేగ గొట్టింది.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
పి.యన్. రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ లో స్త్రీ పాత్రలో నరేశ్ అనితరసాధ్యంగా అలరించారు. వంశీ తెరకెక్కించిన ‘శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లోనూ నరేశ్ అల్లరి భలేగా ఆకట్టుకుంది. గుణశేఖర్ ‘సొగసు చూడతరమా’ లోనూ నరేశ్ నటన మురిపించింది. ఆ తరువాత నరేశ్ హీరోగా నటించిన చిత్రాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. దాంతో తెలివిగా కేరెక్టర్ రోల్స్ లోకి షిఫ్ట్ అయ్యారు నరేశ్. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కితకితలు పెడుతూనే ఉన్నారు. నరేశ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ జనానికి మరింతగా నవ్వులు పంచుతారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..