మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మెగా హీరో బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ వరుణ్ కి తమదైన రీతీలో విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వరుణ్ కి స్పెషల్ గా బర్త్ డే పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తమ్ముడు పుట్టినరోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
” హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివిగలవారు అయిపోరు. అందుకే నీకోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేసినందుకు థాంక్స్. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసి, అమితమైన ప్రేమ చూపించావు. నీ మీద నాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది వరుణ్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అక్కా తమ్ముళ్ల మధ్య బాండింగ్ బావుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక, తండ్రి నాగబాబు కూడా వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.