టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే! సోనాలీ బింద్రే మహారాష్ట్ర…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సల్మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు , చరణ్, వెంకటేష్ లాంటి వారు సల్లు భాయ్ కి తమదైన రీతిలో విషెస్ తెలిపారు. తాజాగా మాజీ ప్రేయసి, కొత్త పెళ్లికూతురు కత్రినా, సల్మాన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సల్మాన్ ఫోటోను…
తనకు తెలిసిన వారు ఆపదలో ఉంటే ఆపన్న హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండలవీరుడుగా పేరొందిన సల్మాన్ ఖాన్ బండల్లాంటి కండల వెనుక వెన్నపూసలాంటి మనసు ఉందని సన్నిహితులు చెబుతారు. బండబారిన హృదయమూ ఉందని, అందుకే ఒకప్పుడు తప్పతాగి కారు నడుపుతూ కొందరి ప్రాణాలూ హరించాడని గుర్తు చేస్తారు ఇంకొందరు. ఇక వన్యప్రాణులను వేటాడి కటకటాలూ లెక్కపెట్టిన సంగతినీ జ్ఞప్తికి తెస్తారు మరికొందరు. ఏది ఎలా ఉన్నా సల్మాన్ ఖాన్ కుటుంబం అసలు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ..…
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే జగన్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమష్యలు ఉన్నాయి.రాష్ర్ట సమష్యల పరిష్కారం కోసం కేంద్రానికి సహకరిస్తూ ముందుకు వెళుతున్నాం అన్నారు ధర్మాన. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజా సంక్షేమమే సిఎం జగన్ లక్ష్యం అన్నారు. సంపూర్ణగృహ హక్కు గతంలో లేదు. ఎన్నో ఆలోచించి ఈ పథకం తెచ్చాం. ప్రతి ఒక్కరికీ నామినల్ వ్యయంతో నివాసానికి రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. ఓటిఎస్…
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్‌కు…
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సీఎం జగన్‌కు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిమిషాల వ్యవధిలో…
నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్‌డే విషెస్‌లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్…
వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన…