‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…
భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం. భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం. కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో. అందరికీ ఈ నాటికీ భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు. నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె. భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే…
చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికించడంలోనూ మేటి అనిపిస్తుంది. కానీ, ఏం లాభం ఇప్పటి దాకా ఆమె నటించిన ఏ చిత్రమూ అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది.…
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం…
ఏసుదాస్ మధురగానంతోనే దినచర్యను ప్రారంభించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆసేతుహిమాచలపర్యంతం ఏసుదాస్ గానానికి ‘సాహో’ అంటూ సలామ్ చేసేవారెందరో! ఇక తెలుగునాట ఏసుదాస్ పాటకు పట్టాభిషేకం చేసేవారి సంఖ్య తరతరానికీ పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. మళయాళ సీమలో జన్మించిన ఏసుదాస్ పాట తెలుగునాట కూడా మధురం పంచుతూనే ఉంది. తొలిసారి తెలుగువారిని ‘బంగారు తిమ్మరాజు’తో ఏసుదాస్ గాత్రం పలకరించింది. కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో ఏసుదాస్ “ఓ నిండు…
అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే…
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు…
పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,…
ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు…
మెరుపు తీగెలాంటి మేనిసోయగంతో చూపరులను ఇట్టే ఆకర్షించే రూపం అందాల దీపికా పడుకోణె సొంతం. దక్షిణాదికి చెందిన ఈ తార ఉత్తరాదిని ఉడికించింది. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోణె పెద్దకూతురు దీపిక. ఒకప్పుడు ప్రకాశ్ కూతురుగా ఉన్న గుర్తింపును ఇప్పుడు దీపిక తండ్రి ప్రకాశ్ పడుకోణె అనే స్థాయికి తీసుకు వెళ్ళింది ఆమె అభినయ పర్వం. నవతరం నాయికల్లో దీపికా పడుకోణె తనదైన బాణీ పలికిస్తూ బొంబాయి సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. దీపికా పడుకోణె మన…