నాటి మేటి అందాల అభినేత్రి… వహిదా రెహమాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు ఎస్సెట్ గా మారింది. యన్టీఆర్ సొంత సంస్థ ఎన్.ఏ.టి. పతాకంపై అప్పటికే ‘పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు’ వంటి అభ్యుదయ చిత్రాలు తీసి నష్టపోయారు. తరువాతి ప్రయత్నంగా ఓ భారీ జానపదం తీయాలని యన్టీఆర్, ఆయన మిత్రులు భావించారు. అందుకు ‘జయసింహ’ కథ సిద్ధం చేసుకున్నారు. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని నటింప చేయాలన్నది యన్టీఆర్, ఆయన దర్శకుడు డి.యోగానంద్ భావన. అలా యన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన మిత్రులు కలసి వహిదా రెహమాన్ గురించి తెలుసుకొని, ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. ఈ లోగా వహిదా రెహమాన్ నృత్యం గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తమ ‘రోజులు మారాయి’లో కొసరాజు రాసిన “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా…” సాంగ్ లో నర్తించడానికి వహిదాను ఎంపిక చేసుకున్నారు. అలా వహిదా రెహమాన్ తెరపై తొలిసారి ‘రోజులు మారాయి’లో తళుక్కుమన్నారు. తరువాత నాయికగా ‘జయసింహ’లో జనం మదిని దోచుకున్నారు. ఎమ్జీఆర్, భానుమతి నటించిన రంగుల చిత్రం ‘ఆలీబాబా 40 దొంగలు’లోనూ ఓ నృత్యగీతంలో మురిపించారు వహిదా.
హైదరాబాద్ లో ‘రోజులు మారాయి’ వంద రోజుల వేడుక జరిగింది. ఆ సమయంలో వహిదా డాన్స్ చూసిన గురుదత్ ఆమెను హిందీ చిత్రసీమకు పరిచయం చేయాలని నిర్ణయించారు. దేవానంద్ తో తాను తెరకెక్కించిన ‘సి.ఐ.డి.’ చిత్రంతో వహిదా రెహమాన్ ను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు గురుదత్. వహిదాలోని నటిని గురుదత్ ఎంతగానో ప్రోత్సహించారు. ఆ తరువాత అనేక విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు వహిదా రెహమాన్. 1971లో ‘రేష్మా ఔర్ షేరా’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు వహిదా రెహమాన్. 1972లో ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషణ్’ అందుకున్నారు వహిదా. తన తొలి హీరో యన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందించే యన్టీఆర్ నేషనల్ అవార్డును 2006లో సొంతం చేసుకున్నారామె. చాలా రోజుల తరువాత ‘రోజులు మారాయి’ హీరో అక్కినేని నటించిన ‘బంగారు కలలు’లో ఆయనకు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’లో వహిదా రాజమాతగా అభినయించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ‘చుక్కల్లో చంద్రుడు’లో ఏయన్నార్ తో కలసి నటించారామె.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
వహిదా రెహమాన్ ను గురుదత్ ఎంతగానో ప్రేమించారు. అయితే, అప్పటికే ఆయనకు వివాహమయింది. ఆ తరువాత గురుదత్ అర్ధాంతరంగా జీవితం చాలించారు. తనతో ‘షగున్’లో హీరోగా నటించిన కమల్ జీత్ ను 1974లో వివాహమాడారు వహిదా రెహమాన్. వారికి ఇద్దరు పిల్లలు. 84 ఏళ్ళు నిండినా ఇప్పటికీ హుషారుగా ఉండే వహిదా రెహమాన్, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!