sampath nandi director మళ్ళీ ‘రచ్చ’ కోసం సంపత్ నంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్నాడు. పట్టుమని ఐదంటే ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది, నిర్మాతగానూ సాగుతున్నారు.
సంపత్ నంది 1980 జూన్ 20న తెలంగాణలోని ఓదెలలో జన్మించాడు. బి.ఫార్మసీ పూర్తి చేయగానే, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి వద్ద మూడేళ్ళ పాటు పనిచేశాడు. అదే సమయంలో ముంబయ్, బెంగళూరుల్లో యాడ్ ఫిలిమ్స్ రూపొందించాడు. యాడ్స్ తీయడంతో మంచి పట్టు లభించింది. దాంతో సినిమాకు డైరెక్షన్ చేయాలని నిశ్చయించాడు. అతని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రంగా ‘ఏమైంది ఈ వేళ’ నిలచింది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఆరంభంలో అంతగా సందడి చేయలేకపోయినా, మెల్లగా గుడ్ టాక్ సంపాదించుకుంటూ సక్సెస్ రూటులో సాగింది. వరుణ్ సందేశ్ స్థాయికి ‘ఏమైంది ఈ వేళ’ హిట్ అనే చెప్పాలి. ఈ సినిమాను చూసి, రామ్ చరణ్ తన ‘రచ్చ’కు సంపత్ నందికి అవకాశం కల్పించాడు. ‘రచ్చ’కు ముందు ఆ చిత్ర నిర్మాతలు రామ్ చరణ్ తోనే ‘మెరుపు’ అనే చిత్రం ఆరంభించారు. అది ఓ షెడ్యూల్ అయిన తరువాత అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. దాంతో సంపత్ నందికి అవకాశం లభించింది. టైటిల్ కు తగ్గట్టే ‘రచ్చ’తో రచ్చ చేసేశాడు సంపత్ నంది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రూపొందిన ‘గాలిపటం’ చిత్రం నిర్మాణంలో పాలుపంచుకున్నాడు సంపత్. తరువాత రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపిస్తూ మరో సినిమాకు దర్శకత్వం వహించాడు సంపత్. అందులోనూ తనదైన మార్కు చూపించాడు,కానీ, ‘రచ్చ’ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత ‘పేపర్ బోయ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు సంపత్. అదీ అంతగా అలరించలేకపోయింది. గోపీచంద్ ద్విపాత్రాభినయంతో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘గౌతమ్ నంద’ భలే ట్విస్టులతో సాగిందే కానీ, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మళ్ళీ గోపీచంద్ తోనే ‘సీటీమార్’ రూపొందించాడు సంపత్ నంది. ఆ సినిమా సైతం జనం చేత సీటీలు కొట్టించలేక పోయింది.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రస్తుతం సంపత్ నంది తన అనుభవాలతో రాసుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి కథ సమకూర్చారు. ‘బ్లాక్ రోజ్’ అనే చిత్రానికీ ఆయనే కథకుడు. రవితేజతో ‘విక్రమార్కుడు-2’ రూపొందిస్తారని ఆ మధ్య వినిపించింది. జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘సింబా’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు సంపత్ నంది. ఈ సినిమాతో సంపత్ ఏ తీరున అలరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు