Kajal : కనికట్టు చేసిన కాజల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంది.
కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది. కన్నవారు ఆమెను అన్నివిధాలా ప్రోత్సహించేవారు. ఎమ్.బి.ఏ చదివి మార్కెటింగ్ లో రాణించాలని ఆశించిన కాజల్ మనసు సినిమాలపైకి మళ్ళింది.
‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే ఉంది. తనదైన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగుతోంది. ‘మగధీర’లో రామ్ చరణ్ సరసన మురిపించిన కాజల్, ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవితోనూ కలసి చిందేసి ఆకట్టుకుంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
పోయిన చోటనే వెదుక్కోవాలని పెద్దలు చెబుతారు. కాజల్ మనసు సినిమాలపై పారేసుకుంది. అందుకే ఇదే చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించింది. ఆరంభంలో ఆట్టే విజయాలు పలకరించక పోయినా, ‘మగధీర’ అఖండ విజయం తరువాత కాజల్ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ జూ.యన్టీఆర్, మహేశ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, రానా తదితరుల సరసన నటించింది. తమిళనాట కూడా కాజల్ హవా విశేషంగా వీచింది. ‘జనతా గ్యారేజ్’లో “పక్కా లోకల్…” అంటూ ఐటమ్ సాంగ్ లోనూ మురిపించింది. తన తొలి చిత్ర దర్శకుడు తేజ రూపొందించిన ‘నేనే రాజు-నేనే మంత్రి’లో రానా సరసన నటించి ఎంతగానో అలరించింది. 2020 అక్టోబర్ 6న గౌతమ్ కిచ్లూను పెళ్ళాడింది కాజల్. పెళ్ళయ్యాక కూడా కాజల్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కాజల్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మూడు చిత్రాలలో నటిస్తోంది కాజల్. అందులో రెండు తమిళ చిత్రాలున్నాయి. ‘ఉమా’ అనే హిందీ సినిమా కూడా ఉంది.
‘చక్రవ్యూహ’ అనే కన్నడ చిత్రంలో “ఏనాయితూ…” అంటూ గళం విప్పిన కాజల్ తనలోని గాయనిని కూడా బయటకు తెచ్చింది. కాజల్ కు కొన్ని తెలుగు చిత్రాలలో అవకాశం వచ్చినట్టే వచ్చి, చేజారి పోయింది. మళ్ళీ తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తోంది కాజల్. మునుముందు ఏ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కాజల్ మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!