NIA Raids : బీహార్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నిషేధిత నక్సలైట్ సంస్థ సీపీఐ మావోయిస్టు ప్రత్యేక ఏరియా కమిటీ సభ్యుడు ఉదయ్ జీ అలియాస్ రాజేష్ కుమార్ సిన్హాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో లాలూకి చెందిన ఆర్జేడీ పార్టీ మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ సభలో నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యే రేఖాదేవిపై సీఎం ఫైరయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ..‘‘ మీరు మహిళ, మీకు ఏమీ తెలియదు. సైలెంట్‌గా వినండి’’ అని సభలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు.
NEET 2024: నీట్ పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఈ బృందం శనివారం పాట్నాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.
16 Snakes and 32 snakes eggs In Home: మనలో చాలామంది పాము అంటేనే భయపడిపోయేవారు చాలానే ఉన్నారు. ఇక కొద్ది దూరంలో పాము ఉందంటే దరిదాపుల్లో కూడా కాపడకుండా వెళ్ళిపోతారు చాలామంది. మరోవైపు పాములను ఇంటి దేవుళ్ళుగా కొలిచేవారు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం వర్షాకాలంలో పాములు నీటి ద్వారా కొట్టుకోవచ్చి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ఓ ఇంట్లో ఏకంగా 16 పాములు, 32…
బీహార్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని, ఆమె సోదరిని, తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని, అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘోరం సరన్ జిల్లాలో చోటుచేసుకుంది.