Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో లాలూకి చెందిన ఆర్జేడీ పార్టీ మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ సభలో నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యే రేఖాదేవిపై సీఎం ఫైరయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ..‘‘ మీరు మహిళ, మీకు ఏమీ తెలియదు. సైలెంట్‌గా వినండి’’ అని సభలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. ‘‘సభలో మీరు(ఆర్జేడీ) ఎప్పుడైనా మహిళల్ని ప్రోత్సహించారా..? 2005లో మేము మహిళల్ని ప్రమోట్ చేశాం. మీరు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మీరు నిశ్శబ్ధంగా ఉండండి, మేం చెబుతాం, వినకుంట అది మీ తప్పు’’ అంటూ ఆర్జేడీ నేతలపై సీఎం నితీష్ విరుచుకుపడ్డారు.
Read Also: Anasuya : విజయ్ దేవరకొండతో గొడవ.. మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్..
సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆర్జేడీ ఎమ్మెల్యచే భాయ్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, సీఎం స్థాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. నిజానికి సభలో కుల గణపై ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న సమయంలో నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో మా ప్రభుత్వం ఎక్కువ మంది మహిళల్ని ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మహిళా ప్రేమికుడని, అందుకు ఇలాగ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
“नहीं कैसे सुनियेगा , सुनना पड़ेगा , हम तो बोलेंगे , करते रहो हल्ला” : विधानसभा में हल्ला कर रहे लालू के विधायकों को लताड़ते हुए नीतीश बोले
महीनों बाद नीतीश कुमार पुराने रूप में वापस आये हैं 🔥 #Bihar #बिहार #NitishKumar pic.twitter.com/Gqvy6O6nns
— Amitabh Chaudhary (@MithilaWaala) July 24, 2024