Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
- పేపర్ లీకేజీపై కఠిన చట్టం తీసుకొచ్చిన నితీష్ సర్కార్
- పదేళ్లు జైలు.. కోటి ఫైన్
- అసెంబ్లీలో బిల్లు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీహార్‌లోని నితీష్ కుమార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బీహార్ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఇది కూడా చదవండి: Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బీహార్ కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మాకు 80-90 సీట్లు కావాల్సిందే.. బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పట్టు..
పేపర్ లీకేజీపై ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిందని మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ చట్టంతో విద్యార్థుల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
#WATCH | On the anti-paper leak bill passed in Assembly today, Bihar Minister Vijay Kumar Choudhary says,"Bihar government has made a strict law against paper leak. With this law, the future of aspirants and students will be secured. The law proposes 10 years imprisonment and a… pic.twitter.com/S3Gjyybsy2
— ANI (@ANI) July 24, 2024
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!