బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ కుమార్ తన 33 నెలల జీతాన్ని తిరిగి జీతాల విభాగానికి అందజేశారు. సుమారు దాదాపు రూ. 23 లక్షలు తిరిగి ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. దీంతో రాజకీయంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Bihar Bridge Collapse: బీహార్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూప్పకూలిపోతున్నాయి. కేవలం 17 రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది.
Marriage proposal: బీహార్‌లో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ దారుణంగా ప్రవర్తించింది. అతడి ప్రైవేట్ పార్టుల్ని కోసేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని సరన్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడి ప్రైవేట్ భాగాలు కత్తిరించి ఫ్లష్ చేసినందుకు నర్సింగ్‌హోమ్‌లో పనిచేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Bihar: బీహార్‌లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది.
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత లేటెస్ట్గా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం మిత్ర పక్షాల సపోర్ట్ పిల్లర్స్‌పై ఆధారపడి ఉంది.