సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు ఢిల్లీలో మౌన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రామాలు మానేయ్ అంటూ ఆయన మాట్లాడారు. భీమ్ దీక్ష అని పెట్టి అందులో…
చలో విజయవాడ లో భాగంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట రామిరెడ్డి బైక్ పై విజయవాడ బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పే స్లిప్ లు చూస్తే గానీ సాలరీ పెరిగిందో తగ్గిందో తెలుసుకోలేని స్థితిలో ఉద్యోగులు లేరని, న్యాయబద్ధమైన హక్కు కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు అవసరమైన ఆందోళన చేసిన ఘటనలు చూశాం…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవాడలో టెన్షన్ వాతావరాణాన్ని నెలకొల్పింది. మరోవైపు ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా.. ఉద్యమం నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు విధించారు. ఛలో విజయవాడకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడిక్కకడే పోలీసులు…
కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆరు రోజుల క్రితం ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాము కాటు.. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి…
మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదని, కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదని ఆయన అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ తగ్గించారు.పంటలకు మద్దతు ధర…
పార్లమెంట్ లో 2022-2023 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ బడ్జెట్ పై మండిపడ్డారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు మొండిచెయ్యి చూపారని, మెట్రో రైలు కు నిధులు అడిగామని, ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని ఆయన వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని…
పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల…
సీఎం కేసీఆర్ నిన్న కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సామ్రాట్ నీవు కేసీఆర్.. ప్రధానమంత్రి పై మాట్లాడే స్థాయి నీకు లేదని ఆమె అన్నారు. 12 వందల పిల్లల ప్రాణాలు తీసుకుని ఆ సీట్లో కూర్చున్నావ్.. కొంచం అన్నా సిగ్గు శరం లేదు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు అంతో ఆమె వ్యాఖ్యానించారు. నీ ఆలోచనే…
ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన…
కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేపట్టింది. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ…