బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేపట్టింది. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదని ఆయన అన్నారు.
రైల్వేస్ పరంగా ఏపీకి ఎటువంటి కేటాయింపులు లేవని ఆయన మండిపడ్డారు. ప్రధాని హోదాలో మోడీ రైల్వే జోన్ పై విశాఖలో హామీ ఇచ్చారని, ఓఎస్డీని పెట్టి మూడేళ్లవుతున్నా ఎటువంటి కేటాయింపులు లేకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కార్పొరేట్ రంగానికి అనేక రాయితీలు ఇచ్చారు కాబట్టే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పరుగులు పెట్టిందని ఆయన అన్నారు. రైల్వేజోన్ కి సంబంధించి కలిసొచ్చే వారందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!