సీఎం కేసీఆర్ నిన్న కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సామ్రాట్ నీవు కేసీఆర్.. ప్రధానమంత్రి పై మాట్లాడే స్థాయి నీకు లేదని ఆమె అన్నారు. 12 వందల పిల్లల ప్రాణాలు తీసుకుని ఆ సీట్లో కూర్చున్నావ్.. కొంచం అన్నా సిగ్గు శరం లేదు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు అంతో ఆమె వ్యాఖ్యానించారు. నీ ఆలోచనే దోపిడీ … నువ్వు దోపిడీ దారుడవు. కేంద్ర బడ్జెట్ ని జీర్ణించుకోలేక మాట్లాడావు… నీవి ముదనష్టపు ఆలోచనలు.. పిచ్చి లేసి పిచ్చి కుక్క లెక్క మాట్లాడారు… కేసీఆర్ అంటూ ఆమె తిట్ల దండకం అందుకున్నారు.
నిన్నటి బడ్జెట్ దేశం కోసం పెట్టింది..నీ అవినీతి సొమ్మును ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడకు పంపుతున్నావ్ అంటూ ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా ఏమన్నా వేసుకొని వచ్చి మాట్లాడేమో కేసీఆర్ నిన్న.. అంబానీ ఆదాని లను మించిపోయి ఉంటావు.. వాళ్ళు వ్యాపారాలు చేసుకొని సంపాదిస్తే నీవు అవినీతి చేసి సంపాదించావ్.. పాస్ పోర్ట్ బ్రోకర్ , దుబాయ్ శేఖర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి రెండో సారి అధికారం లోకి వచ్చావు. ఇక్కడ నీళ్లు అన్ని వాడుకుంటున్నవా… ఎన్ని ప్రాజెక్టు లు కట్టావు.. కేసీఆర్ కిట్ లో కేంద్ర నిధులు ఉన్నాయి… చిల్లర బాషా, కంత్రి వేషాలు కేసీఆర్ వి అంటూ ఆమె మాట్లాడారు.