రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ…
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు.…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.…
అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం మేనల్లుడుని ఈడీ అరెస్ట్ చేయడం పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈడీ అరెస్ట్ చేసిన పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హాని ను వైద్య పరీక్షల తరువాత మొహాలీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. భూపిందర్ సింగ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈడీ అధికారులు భూపిందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ. 8…
మరో బ్యాంకు కుప్పకూలింది. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నేటి నుంచే అంటే ఫిబ్రవరి 3, 2022 నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. గురువారం దీనిపై ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తాము గతేడాదినే కొన్ని ఆంక్షలు విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు…
త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ…
రాజ్యాంగం మీద ప్రమాణము చేసిన వ్యక్తి మాట మార్చడం అనేది సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తులు కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ద్వారానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కొత్త రాజ్యాంగం కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నట్లే కదా అని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 65 సార్లు హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ…
కేసీఆర్ వాఖ్యల పై బీజేపీ నాయకులు చిల్లర మల్లారా మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో…
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో త్వరలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో, ఒకవైపు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన 2BHK హౌసింగ్ సైట్‌లలో ఇదొకటి, కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుంది.” అని కేటీఆర్ వెల్లడించారు. ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్…
జంతువులతో సహా ఎవరినీ కరోనా విడిచిపెట్టలేదని చూపడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని అధికారులు జంతువుల ఎన్‌క్లోజర్‌లలోకి వైరస్ ప్రవేశించకుండా చూసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. “ఇప్పటి వరకు, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. అయితే, నగరంలో పెరుగుతున్న కేసులు జంతువులపై ప్రభావం చూపకుండా చూసేందుకు, మేము కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మా పశువైద్యులు అన్ని జంతువులను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు వాటి ప్రవర్తన, ఆహారం మరియు నిద్ర విధానాలను పర్యవేక్షిస్తున్నారు. మా…