స్వర శిఖరం మూగబోయింది.. సంగీత ప్రియుల గుండెల్లో తీరని శోకాన్ని మిగిల్చి ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్ అందిరికి అందనంత ఎత్తుకు ఎగిరిపోయారు. లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో. ప్రయాణాల్లో, పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరేట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి. ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది. ఆమె కీర్తి అజరామరం. ఆమె అందుకున్న విజయాలు అనంతం. . 2022 జనవరి 11న…
బడ్జెట్ క్యారియర్ ఇండిగో ‘వాక్సి ఫేర్’ అంటూ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో ఫస్ట్, సెకండ్ డోస్‌లను తీసుకున్న ప్రయాణీకులకు బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. భారతదేశంలో ఉన్న టీకాలు వేసుకున్న ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మహమ్మారి మధ్య విమాన ప్రయాణాన్ని పెంచే ప్రయత్నంలో ఈ చర్య తీసుకున్నారు. ఇండిగో తాజాగా ట్విట్టర్‌లో “అందరూ టీకాలు వేసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? వాక్సి ఫేర్‌తో బుక్ చేసుకోండి, మీ ట్రిప్‌ను…
ఈ నెల 8న ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 40కి పైగా కంపెనీలు మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాయి. ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రకారం తగిన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెండు సెట్ల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ / ‘మన బస్తీ-మన బడి’ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల కోసం ఒక పెద్ద మరమత్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల కోసం కూడా ఇదే విధమైన మార్పును లక్ష్యంగా చేసుకుంటుంది. రాష్ట్రంలోని 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తరగతుల నిర్వహణకు పాఠశాలల ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నందున రాష్ట్ర విద్యా శాఖ దీనిపై దృష్టి సారించింది.…
సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాల పై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత లేదని, మోడీ ఆరోజే రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన హామీలు ఎటు పోయాయి, ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమని,…
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు…
మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు…
పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో పాతబస్తీ లో టెన్షన్ నెలకొంది.…
హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు.…