పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుందని, ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమీ అన్నారు. అంతేకాకుండా.. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించామని…
కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాక ముందు కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ కంటే.. థర్డ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఉంది. దీంతో…
ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మంగళవారం ప్రతిపక్ష పార్టీలకు “ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి అభిప్రాయాలు లేవని” అన్నారు. “ఆర్థిక సర్వే తర్వాత భారతదేశంలో ప్రతిపక్షం లేదని మీరు నిర్ధారణకు వస్తారు మరియు బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, దానికి ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి అభిప్రాయాలు లేవు” అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయ సభల్లో…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.…
భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి మంగళవారం తెలిపారు. భారతదేశంలో సోమవారం 2,09,918 కరోనా కేసులు, 959 మరణాలు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో 1,192 కొత్త మరణాలు సంభవించడంతో, దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ…
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం…
కుళాయి నీటి సరఫరాలో 100 శాతం సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది. సోమవారం పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే 2021-22 నివేదిక ప్రకారం, జనవరి 2 నాటికి భారతదేశంలోని దాదాపు 5.51 కోట్ల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా అందించబడిన ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హర్యానాతో పాటు తెలంగాణ మాత్రమే ఒక స్థానాన్ని పొందిన ఏకైక ప్రధాన రాష్ట్రంగా నిలిచింది. యాదృచ్ఛికంగా, ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం…
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100…
హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్…
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…