నిన్న వరంగల్‌లో బీజేపీ శ్రేణులు వచ్చి అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్‌లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ…
ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని, టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు…
కరోనా వైరస్ మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రధాని మోడీ ధర్డ్‌వేవ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాపై ఆంక్షలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, మందుల పంపిణీ, ముందస్తు నిల్వలు వంటి కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని, కంటైన్‌మెంట్…
కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ దాటికి ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎంతో మంది కుటుంబ పెద్దలు కరోనా బారినపడి మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కోవిడ్ టీకాలను కూడా పంపిణీ చేస్తోంది. దీంతో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, ఇటీవల వెలుగు చూసిన…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అయితే దీంతో ఈ వేరియంట్ పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 20,971 కొత్త కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. అయితే మహారాష్ట్రలో 20 వేల కేసులు దాటితే లాక్‌డౌన్ విధిస్తామని మహా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు సంఖ్య ప్రకారం మహాలో…
తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తుండగా గ్యాస్‌పైపులైన్ పగిలిన ఘటన హైదరాబాద్నిజాంపేట్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై.. లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గాయత్రీ టవర్ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతు పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్ పైప్ పగిలిపోయింది. అందులో నుంచి గ్యాస్ లీకవుతుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకవ్వడంతో…
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం సమయంలో పరిమితి మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకునే ఖర్చును సవరణలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు.. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలకు ఎంత మేర ఖర్చు చేయొచ్చనే అంశంపై సవరణ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 95 లక్షలు,…
ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు…
ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ…
గత రెండు రోజులుగా తెలంగాణ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేడు సికింద్రాబాద్‌లోని మహత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిచేందుకు పిలుపు నిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జేపీ నడ్డాను ఆహ్వానించేందుకు కొందరినీ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు. అయితే అనుమతించిన…