ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు పెన్షన్ ఇవ్వాలని సీఎంను కోరామన్నారు.
పబ్లిక్ సెక్టార్ గురుకుల పాఠశాలలకు కూడా ఫిట్‌మెంట్ బెనిఫిట్ అడిగామని, సీపీఎస్ హామీని తప్పకుండా అమలు చేయాలని సీఎంను కోరామన్నారు. కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఆడిగామని, 2100 కోట్ల బిల్స్ బకాయిలతో పాటు పెండింగ్ ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని ఆడిగామన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల హెల్త్ కార్డ్ విషయంలో గత కొన్నేళ్లుగా నిర్వీర్యం అయిందని చెప్పాము.. హెల్త్ కార్డ్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరాము.. గ్రామ సచివాలయ ఉద్యోగుల కు కూడా పే స్కేల్ కొత్తవి ఇవ్వాలని కోరాము.. కరోనా వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాము.. తక్షణమే జీఓ ఇవ్వాలని కోరాము.. నేను ఉద్యోగుల కుటుంబ సభ్యుల కుటుంబంలో ఒకడిని అని సీఎం జగన్ చెప్పారన్నారు. కరోనా వల్ల వచ్చిన ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోవాలని సీఎం కోరారని ఆయన వెల్లడించారు.