ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్ ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నాడని అతడిని బీజాపూర్ జిల్లా బాసగూడలో హత్య చేశారు. అయితే గతంలోనూ మాజీ ఉప సర్పంచ్‌ను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నేపంతో ప్రజా కోర్టు శిక్షించినట్లు మావోయిస్టులు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ వికలాంగుడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణతో జన మిలీషియా సభ్యులు…
గత సంవత్సరం నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలుదేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఈ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే డబ్ల్యూహెచ్‌వో చెప్పినదాని కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 94 కొత్త ఒమిక్రాన్ కేసులు…
మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతిచెందారు. గడిచిన 24…
రోజురోజుకు భారత్‌లో కోవిడ్ విజృంభన పెరిగిపోతోంది. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను తీవ్రతరం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు…
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల దేశానికే కాదు రాష్ట్రానికీ ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని…
కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్‌లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో వర్చువల్ విధానంలో పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకం అమలు కానుంది. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన లాభాలు వస్తాయని ఇప్పటికే జగన్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి…
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్‌లో ఏదైనా…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు వ్యాపించగా అక్కడ పలు ఆంక్షలు విధించారు. కొన్ని దేశాల్లో విమాన రాకపోకలపై నిబంధనలు పాటిస్తున్నారు. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ విజృంభన పెరిగిపోతుండడంతో తాజాగా యూకేలో ఒక్కరోజే 15,363 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళన చెందుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకు…