రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు.…
ఈ నెల 2వ తేదీన కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు నేడు సాయంత్రం సికింద్రాబాద్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ర్యాలీ…
ఈ నెల 2న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతులు లేవని, కోవిడ్ నిబంధనలు ఉలంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మరుసటి రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో బండి సంజయ్ తరుపు లాయర్…
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. నేడు కేసీఆర్ వైద్యాశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు వైద్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు…
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభన మొదలైంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు.…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు ప్రజలు చరమ గీతం పాడుతారని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు…
నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్…
ఉద్యోగ బదీలీల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేపట్టారంటూ నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్ని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బండి సంజయ్ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లి…
కేంద్ర మంత్రులు నిర్మలాసీతారమన్, మహేంద్రనాథ్‌లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేక రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను కేంద్రం పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీసీఐ యూనిట్ తెరిచేందుకు సానుకూల అంశాలున్నాయని ఆయన అన్నారు. దేశీయంగా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉందని, ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు లాభాలు అర్జిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే సీసీఐ తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకు ఇచ్చే ప్రోత్సహకాలు,…