వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. అనంతరం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సిటీ స్కాన్ ప్రారంభించారు. దీంతో పాటు సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటి…
భారత్‌పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెల్‌లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానెళ్లపై ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్థాన్‌కు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్లు…
Telangana BJP Chief Bandi Sanjay Clarify About Singareni Privatization. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు…
తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో…
Telangana Finance Department Green Signal to Recruit 30,453 Jobs. తెలంగాణ ఆర్థిక శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో 80,039 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీంతో ప్రసుత్తం మొదటి విడుత కొలువుల జాతర ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా ఆయా శాఖల్లోని ఖాళీలను బట్టి వేరువేరు నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 30,453…
TS EAMCET 2022 Schedule. తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 18, 19, 20…
అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు…
నేటి సమాజంలో మొబైల్ తెలియని వారు లేరు. అందులో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండనే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో దుమ్మురేపుతున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్‌డేట్‌లో, వినియోగదారులు వారి వాట్సాప్ ప్రొఫైల్‌ల కోసం కవర్ ఫోటోలను సెట్…
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని అన్ని కోర్సులకు ఆఫ్‌లైన్ తరగతులు ఫిబ్రవరి 1 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. ‘ప్రభుత్వ సూచనల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని అన్ని కోర్సులకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు కోర్సులు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని పేర్కొన్నారు. “నగరంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్…
ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన నూతన జిల్లాల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నూతన జిల్లాల అంశంపై టీడీపీ అధినేత పలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా నా తరపున, ఎన్టీఆర్ ను దైవంగా భావించే…