కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ దాటికి ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎంతో మంది కుటుంబ పెద్దలు కరోనా బారినపడి మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కోవిడ్ టీకాలను కూడా పంపిణీ చేస్తోంది. దీంతో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, ఇటీవల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పెరుగుతున్నాయి.
భారత్‌లో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా తెలంగాణలో సైత ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కేసులు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వారు హోం ఐసోలేషన్లో వున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కరోనా సోకిన ఓ కానిస్టేబుల్ తెలిపారు.